Thursday, April 15, 2010

ఈ బ్లాగు పుట్టు పూర్వూత్తరాలు ......

ఒక రోజు ఫ్రెండ్ తో ఫోన్ లో చిన్నప్పటి ఒక కామెడి విషయం తలుచుకుని నవ్వుకున్నా......
కాల్ అయిపోయిన తర్వాత......పాడుకోడానికి రెడీ అయ్యాను కానీ రూం లో ఎవరు లేరు...
సో ఏదో లోన్లీ ఫీలింగు...ఇంతలో నా చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కొటిగా గుర్తుకొచ్చాయి..... అన్నీ ఒక నోటేపాడ్ లో రాసా...మల్లి మర్చిపోతానేమో అని .....
వీటన్నింటిని ఒక బ్లాగ్ రూపం లో రాస్తీ ఎలా ఉంటుందని ఒక ఆలోచన తట్టింది...
అంతే డిసైడ్ అయ్యా బ్లాగ్ రాద్దామని ......చాల మందికి ఇలాంటి జ్ఞాపకాలు ఉంటాయని ఆసిస్తూ...
నా జ్ఞాపకాలు చదివితే మీకు కూడా మీ మీ చిన్ననాటి స్వీట్ మెమోరీస్ గుర్తు వస్తాయని ఆకాంక్షిస్తూ ...... ఈ బ్లాగు అందరికి అంకితం......

ఫైనల్ గా - బాధ కలిగినప్పుడు మీ హ్యాపీ Moments ని గుర్తుకు తెచ్చుకోండి..... చాలు ఏదో గుండెల మీద నుంచి బరువు తీసినట్టుంటుంది......... ట్రై  

స్కూల్ టైం అయ్యింది.....

టింగ్ టింగ్ టింగ్ ........టింగ్ టింగ్ టింగ్ .....గంట మోగింది స్కూల్ టైం అయ్యింది
ఇంటి పక్కనే స్కూల్.................
అమ్మ నోట్లో అన్నం పెడుతూ ఉంటాది.....నేను షూస్ వేసుకుని రెడీ ఐపోయి
చక చకా ఆ సిల్వర్ బాక్స్ ఓపెన్ చేసి రూం లో అంటించుకున్న టైం టేబుల్ చూసుకుని ఆ రోజు టైం టేబుల్ ప్రకారం బుక్స్ సద్దుకుని బాక్స్ నెత్తిన పెట్టుకుని క్లాసు కి వెళ్లి బాక్స్ ప్లేస్ లో పడేసి స్కూల్ ప్రయెర్ కి వెళ్లి 1 హ్యాండ్ దూరం లో నిలబడాలి .....................
stand it is , attention చెప్పి వందేమాతరం ...పాడి చివరగా స్కూల్ pledge(how could we forget this....INDIA is my country......) చెప్పి క్లాసు కి వెళ్లి కూర్చుంటాము...